కెన్యా జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి ఒప్పందాన్ని దక్కించుకున్న చైనా
కెన్యా జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు చైనాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భారీ ప్రాజెక్టు విలువ 2.9 బిలియన్ డాలర్లు. చైనా కమ్యూనికేషన్స్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఈ పనిని చేపట్టింది. గతంలో ఈ ప్రాజెక్టును అదానీ గ్రూప్ దక్కించుకుంది. కానీ 2024 నవంబర్‌లో అమెరికా న్యాయశాఖ చేసిన ఆరోపణల వల్ల అదానీ డీల్ రద్దయ్యింది. అదానీ ప్రతిపాదించిన ప్రాజెక్టు విలువ 2 బిలియన్ డాలర్లు. చైనా కంపెనీ ఒప్పందం దీనికంటే 50 శాతం ఖరీదైనది. కెన్యాలో ఈ ప్రాజెక్టుపై ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నెల్సన్ అమేన్యా అనే వ్యక్తి ఈ నిరసనలను నడిపించారు.