పొలంలో పాము కాటుకు గురై రైతు మృతి

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట మండలం జాడుపేట గ్రామానికి చెందిన కర్ణం సింహాచలం అనే రైతును పాము కాటుకు గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు మరియు భార్య భారతమ్మ తెలిపిన వివరాల ప్రకారం రోజువారీ వ్యవసాయ పనుల్లో భాగంగా సింహాచలం ఉదయాన్నే తన పొలానికి వెళ్లగా అక్కడ అనుకోని విధంగా విషసర్పం ఆయనపై కాటు వేసింది. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను గమనించిన తోటి రైతులు మరియు కుటుంబ సభ్యులు కలిసి ప్రాథమిక చికిత్స నిమిత్తం ఎల్.ఎన్.పేట మండల కేంద్రంలోని లక్ష్మీనర్సుపేట ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో చేరిన సింహాచలానికి వైద్యులు శరవేగంగా వైద్య సేవలు అందించినప్పటికీ శరీరంలోకి విషం పూర్తిగా పాకడంతో పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ ఆయన ఆసుపత్రిలోనే కన్నుమూశారు. మృతునికి భార్య భారతమ్మతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org