డీజిల్ కొనుగోళ్లపై పరిమితులు విధించిన కేంద్ర ప్రభుత్వం : 90 రోజుల వరకు అమల్లో కొత్త నిబంధనలు
పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది. ఇక నుంచి ఎంత కావాలంటే అంత డీజిల్ నింపుకోవడానికి వీలు ఉండదు. ప్రభుత్వం నిర్ణయించిన పరిమితి వరకు మాత్రమే డీజిల్ కొనుగోలు చేసే అవకాశముంటుంది. ఈ మేరకు అన్నీ చమురు కంపెనీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ “మోటార్ స్పిరిట్, హై-స్పీడ్ డీజిల్ ఆర్డర్, 2026ను జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం పలు కఠిన నిబంధనలు విధించింది. ఒక వ్యక్తి ఏ వాహనానికైనా ఒక్కరోజులో గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే కొనుగోలు చేయడానికి వీలుంటుంది. అంతకంటే ఎక్కువ కొనుగోలు చేసేందుకు సాధ్య పడదు. అంతేకాకకుండా కొనుగోలు చేసిన డీజిల్‌ను వినియోగదారుడు తిరిగి విక్రయించడంపై నిషేధం అమల్లోకి తెచ్చింది. డీజిల్ బ్లాక్ మార్కెటింగ్ అడ్డుకోవడం, నిల్వల లభ్యతను పెంచడం కోసం కేంద్రం ఈ రూల్స్ తీసుకొచ్చింది. 90 రోజుల వరకు ఈ కొత్త నిబంధనలు అమల్లో ఉంటాయి. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై నిత్యావసర వస్తువుల చట్టం, 1955, ఇతర వర్తించే చట్టాల ప్రకారం జరిమానా విధించడం, ఇతర చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో వినియోగదారులకు డీజిల్ లభ్యతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.