నేను దేవుడిని నమ్మను - అమ్మ విశ్వాసాన్ని గౌరవించడం నా బాధ్యత : ట్రోలర్స్కి సమాధానమిచ్చిన ప్రకాష్ రాజ్


టుడు ప్రకాశ్ రాజ్ తల్లి సువర్ణలత గత సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. మార్చి 31న బెంగళూరులోని ఒక చర్చిలో క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ తీవ్ర భావోద్వేగంతో కనిపించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. అయితే, సామాజిక మరియు రాజకీయ అంశాలపై తరచుగా తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉండే ప్రకాశ్ రాజ్, తాను నాస్తికుడని గతంలో పలుమార్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ఆయనపై విమర్శలు చేస్తూ పోస్టులు పెట్టారు. గతంలో తాను 'నాస్తికుడు' అని చెప్పిన ఓ ఇంటర్వ్యూ వీడియోను షేర్ చేస్తూ, క్రైస్తవ పద్ధతుల్లో అంత్యక్రియలు నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు. ఈ విమర్శలకు స్పందిస్తూ, ట్రోలర్స్కి ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా గట్టి సమాధానమిచ్చాడు. 'నేను దేవుడిని నమ్మను. కానీ నా తల్లి తన దేవుడిని నమ్మింది. ఆమె విశ్వాసాన్ని గౌరవించడం నా బాధ్యత. ఆమె నమ్మకానికి అనుగుణంగా అంత్యక్రియలు చేయడంలో తప్పేంటి? ఇది మనం ఒకరికొకరు ఇచ్చే కనీస గౌరవం' అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. క్రమంలోనే తనపై వస్తోన్న ట్రోల్స్‌ను 'ద్వేషాన్ని నింపుకున్న మీలాంటి రాక్షసులకు ఇది అర్థమవుతుందా' అంటూ ప్రకాష్ రాజ్ విమర్శించారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org