హైటెక్ సిటీలో అటానమస్ ఎంటర్‌ప్రైజ్ ఆర్కెస్ట్రేషన్ ప్లాట్‌ఫామ్‌ రెడ్‌వుడ్ సాఫ్ట్‌వేర్ గ్లోబల్ సెంటర్‌ ప్రారంభం


హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో అటానమస్ ఎంటర్‌ప్రైజ్ ఆర్కెస్ట్రేషన్ ప్లాట్‌ఫామ్‌ రెడ్‌వుడ్ సాఫ్ట్‌వేర్ గ్లోబల్ సెంటర్‌ను  ప్రారంభించింది. సుమారు 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని రెడ్‌వుడ్ సీఈఓ కెవిన్ గ్రీన్, తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ వ్యవస్థాపక సీఈఓ ఫణి నాగార్జున, రెడ్‌వుడ్ ఇండియా కంట్రీ హెడ్ రాజ్‌కుమార్ పాల్‌రాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్‌వుడ్ సీఈఓ కెవిన్ గ్రీన్ మాట్లాడుతూ, అటానమస్ ఎంటర్‌ప్రైజ్ నిర్మాణంలో హైదరాబాద్ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఏజెంటిక్ ఏఐ ఆవిష్కరణలు, గ్లోబల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌లో ఈ కేంద్రం ప్రధాన చోదక శక్తిగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఉన్న అద్భుతమైన టాలెంట్, ఎకోసిస్టమ్ తమ కంపెనీ వృద్ధికి ఎంతో దోహదపడుతుందని, అందుకే ఇక్కడ కార్యకలాపాలను విస్తరిస్తున్నామని ఇండియా కంట్రీ హెడ్ రాజ్‌కుమార్ పాల్‌రాజ్ పేర్కొన్నారు. ఉద్యోగ కల్పన విషయంలో కూడా రెడ్‌వుడ్ సాఫ్ట్‌వేర్ భారీ లక్ష్యాలను ప్రకటించింది. 2027 చివరి నాటికి ఇంజనీరింగ్, క్లౌడ్, బిజినెస్ ఆపరేషన్స్ విభాగాల్లో సుమారు 300 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నట్లు సంస్థ వెల్లడించింది. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org