దేశీయ మార్కెట్లో మే నెలలో ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 సీరీస్ లో మరో రెండు మోడల్స్‌ను లాంచ్ చేయనుంది. గ్లోబల్ మార్కెట్‌లో ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారిన ఫైండ్ ఎక్స్ 9 అల్ట్రా, ఫైండ్ ఎక్స్ 9 ఎస్ మోడల్స్ విడుదల చేయనుంది. ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ఒప్పో ఈ ఫైండ్ X9 అల్ట్రాను స్పెషల్‌గా డిజైన్ చేసింది. దీనిలో హ్యాసెల్‌బ్లాడ్ కెమెరా సిస్టమ్ ఉండటం వల్ల ఫొటోలు చాలా నేచురల్‌గా వస్తాయి. మెయిన్ కెమెరా ఏకంగా 200MP కావడం విశేషం. దీనికి తోడు 200MP పోర్ట్రెయిట్ లెన్స్ కూడా ఉంది. దీంతో మీరు తీసే ప్రతి ఫొటో ఒక DSLR కెమెరాతో తీసినట్టే క్లియర్‌గా ఉంటుంది. ఇక 10x ఆప్టికల్ జూమ్ ఉండటం వల్ల ఎక్కడో దూరంగా ఉన్న వస్తువులను కూడా స్పష్టంగా షూట్ చేయొచ్చు. ఈ ఫోన్ కేవలం కెమెరాలోనే కాదు.. స్పీడ్ విషయంలో కూడా ముందుంటుంది. దీనిలో లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ను వాడారు. దీంతో భారీ గేమ్స్ ఆడినా, ఎన్ని యాప్స్ వాడినా ఫోన్ అస్సలు స్లో అవ్వదు. ఇక 6.82 ఇంచుల పెద్ద స్క్రీన్ మీద వీడియోలు చూస్తుంటే థియేటర్ అనుభూతి కలుగుతుంది. దీనిలో ఉన్న 7050mAh భారీ బ్యాటరీని ఫాస్ట్‌గా ఛార్జ్ చేయడానికి 100W ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. మరోవైపు కొంచెం తక్కువ బడ్జెట్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు కావాలనుకునే వారి కోసం ఫైండ్ X9s రాబోతోంది. దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 9500s ప్రాసెసర్ ఉంటుంది. చేతిలో పట్టేలా హ్యాండీగా ఉండే ఈ ఫోన్.. కాలేజ్ స్టూడెంట్స్‌కు, ఆఫీస్ పనుల కోసం ఫోన్ వాడేవారికి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. దీనిలో కూడా 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఇస్తున్నారు. దీనితో 4K వీడియోలు అదిరిపోయే క్వాలిటీతో తీసుకోవచ్చు. సాధారణంగా పెద్ద పెద్ద ఫోన్లలో బ్యాటరీ త్వరగా అయిపోతుందని చాలామంది భయపడుతుంటారు. కానీ ఒప్పో ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసి రెండు ఫోన్లలోనూ 7000mAhకి పైగా కెపాసిటీ ఉన్న బ్యాటరీలను పెట్టింది. ఫైండ్ X9sలో 7025mAh బ్యాటరీ ఉండటం వల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా హ్యాపీగా వాడుకోవచ్చు. వీటికి తోడు ఫోన్ నీటిలో పడినా ఏమీ కాకుండా వాటర్ రెసిస్టెంట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.
0 Comments