ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ : నితేష్‌కు రజతం


ఇండియా స్టార్‌ రెజ్లర్‌ నితేష్‌ ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో సిల్వర్‌ మెడల్‌తో మెరిశాడు. బుధవారం జరిగిన మెన్స్‌ 97 కేజీల ఫైనల్లో నితేష్‌ 1-7తో డిఫెండింగ్‌ చాంపియన్‌ మహ్మద్‌ హాదీ సరవి (ఇరాన్‌) చేతిలో ఓడాడు.బౌట్‌ ఆరంభంలో మెరుగైన ప్రదర్శన చూపిన ఇండియన్‌ రెజ్లర్‌ మధ్యలో పట్టు తప్పాడు. దాంతో ఇరాన్‌ రెజ్లర్‌ వరుస పాయింట్లతో ఆధిక్యాన్ని సంపాదించాడు. 67 కేజీ బ్రాంజ్‌ ప్లే ఆఫ్‌ బౌట్‌లో సచిన్‌ సెహ్రావత్‌ 6-5తో అబ్దుమాలిక్‌ అమీనోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)పై గెలిచి కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. 82 కేజీ ప్లే ఆఫ్స్‌లో ప్రిన్స్‌ 10-1తో దీదర్‌ అమన్‌జరోవ్‌ (తుర్క్‌మెనిస్తాన్‌)పై ఏకపక్ష విజయం సాధించాడు. విమెన్స్‌ సెమీస్‌లో హన్సిక లంబ (55 కేజీ), నేహ (59 కేజీ) సెమీస్‌లో ఓడినప్పటికీ కాంస్య పతక పోరుకు అర్హత సాధించారు. హన్సిక.. యుక్సువాన్‌ లీ (చైనా) చేతిలో, నేహ.. మెంగ్యు కీ (చైనా) చేతిలో ఓటమిపాలయ్యారు. 50 కేజీల విభాగంలో నీలమ్‌ రెప్‌ఛేజ్‌ రౌండ్‌ ద్వారా మెడల్‌ రేసులో నిలిచింది. ప్రస్తుతం ఇండియా 2 సిల్వర్‌, 3 బ్రాంజ్‌ మెడల్స్‌తో కొనసాగుతోంది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org