జమ్మూ కాశ్మీర్‌లో ప్రధాన బస్టాండ్‌లో భారీ అగ్నిప్రమాదం : ఏడు బస్సులు అగ్నికి ఆహుతి


జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా ప్రధాన బస్టాండ్‌లో బుధవారం అర్ధరాత్రి దాటాక భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పార్క్ చేసి ఉన్న ఏడు బస్సులు మంటలకు ఆహుతయ్యాయి. అయితే, అర్ధరాత్రి సమయంలో బస్టాండ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే 6 బస్సులు పూర్తిగా మంటల్లో చిక్కుకుని ఉండటాన్ని గమనించారు. సిబ్బంది సుమారు 7 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో మొత్తం ఏడు బస్సులు కాలిబూడదయ్యాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం, గాయాలు సంభవించలేదని అధికారులు ధృవీకరించారు. అర్ధరాత్రి కావడం, బస్సుల్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రస్తుతం అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయా, మరేదైనా ఉగ్ర కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org