Ad Code

2027 మార్చి 14న 99వ ఆస్కార్‌ వేడుక, 2028 మార్చి 5న 100వ ఆస్కార్‌ వేడుక !


2027 మార్చి 14న 99వ ఆస్కార్‌ వేడుకను, అలాగే 100వ ఆస్కార్‌ వేడుకను 2028 మార్చి 5న నిర్వహించబోతున్నట్లు అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ ప్రకటించింది. అయితే ఇటీవల ఈ వేడుకల నిర్వహణ గురించి అకాడెమీ ఓ ప్రకటన చేసింది. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న డాల్బీ థియేటర్‌ వేదికను వదిలి, 2029 నుంచి లాస్‌ ఏంజిల్స్‌లోని పీకాక్‌ థియేటర్‌లో ఈ వేడుకలను నిర్వహించాలని అకాడమీ నిర్ణయించింది. అంతేకాకుండా దశాబ్దాల పాటు కొనసాగిన టీవీ బ్రాడ్‌కాస్టింగ్‌కు స్వస్తి పలుకుతూ, 2029 నుండి ఆస్కార్‌ వేడుకలను నేరుగా యూట్యూబ్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయబోతున్నారు. 2026-2027 అవార్డుల సీజన్‌కు సంబంధించి, 2026 ఏడాది పొడవునా విడుదలయ్యే సినిమాలు అవార్డులకు అర్హత పొందుతాయని, 2027 జనవరి 21న నామినేషన్లను ప్రకటిస్తామని అకాడమీ స్పష్టం చేసింది. 

Post a Comment

0 Comments

Close Menu