మాజీ క్రికెటర్, టీఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్ మామ ఖలీద్ ఖాన్, బామ్మర్ది ఉమర్‌షాద్ ఖాన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డుపై కారు వెళ్తుండగా నీళ్లు చిందాయన్న చిన్న వివాదం చినికి చినికి గాలివానలా మారి ఈ దాడికి దారితీసింది. ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో యూసుఫ్ ఖాన్ అనే వ్యక్తి కారులో వెళ్తుండగా, ప్రమాదవశాత్తు రోడ్డుపై ఉన్న నీరు షోయబ్ అనే వ్యక్తిపై పడింది. బాధితుడు క్షమాపణలు చెప్పినా వినకుండా షోయబ్ కారు అద్దాలు పగలగొట్టి దాడికి దిగాడు. బాధితుడు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా, ఎంపీ బంధువులు మరికొందరితో కలిసి వారిని అడ్డుకుని బేస్‌బాల్ బ్యాట్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా యూసుఫ్ పఠాన్ మామ, బామ్మర్ది సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరిపై హత్యాప్రయత్నం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments