Ad Code

హిందీ భాషలో వెయ్యి కోట్లు రాబట్టిన ధురంధర్-2


బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన స్పై యాక్షన్ చిత్రం ‘ధురంధర్’ సిరీస్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ రెండు భాగాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ. 3,000 కోట్ల భారీ వసూళ్ల క్లబ్‌లో చేరి రికార్డు నెలకొల్పాయి. దీంతో భారతీయ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఫ్రాంచైజీగా ధురంధర్ నిలిచింది. ఇప్పటివరకు భారతీయ చిత్రసీమలో ‘బాహుబలి’ (రూ. 2,438 కోట్లు), ‘పుష్ప’ (రూ. 2,092 కోట్లు) సిరీస్‌లు అత్యున్నత స్థానంలో ఉండగా, ఇప్పుడు ధురంధర్ వాటిని అధిగమించింది. ఈ ఫ్రాంచైజీ మొత్తంగా రూ. 3,025.97 కోట్లను వసూలు చేసింది. ఇందులో మొదటి భాగం రూ. 1,307.35 కోట్లు రాబట్టగా, ‘ధురంధర్-2: ది రివేంజ్’ ఏకంగా రూ. 1,718.62 కోట్లతో ప్రభంజనం సృష్టించింది. ధురంధర్-2 చిత్రం భారతీయ చిత్ర పరిశ్రమలో ఒకే భాషలో (హిందీ) రూ. 1,000 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించిన తొలి చిత్రంగా అరుదైన ఘనత సాధించింది. దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల షోలతో ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం, 26వ రోజు కూడా తన జోరును కొనసాగించి రూ. 5.20 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఈ ఇండియాలో రూ. 1,303.37 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించగా, విదేశాల్లో రూ. 415.25 కోట్లు రాబట్టింది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌లో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. 

Post a Comment

0 Comments

Close Menu