ఔటర్ రింగ్ రోడ్డుపై వాటర్ ట్యాంకర్‌ను కారు ఢీకొనడంతో తండ్రి, కొడుకు దుర్మరణం


హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పక్కన చెట్లకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకర్‌ను అతివేగంతో వచ్చిన కారు ఢీకొనడంతో తండ్రి, కొడుకు దుర్మరణం పాలైయ్యారు. హన్మకొండకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కాటంగూరి వేద ప్రకాష్ రెడ్డి (37) తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో బెంగుళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పెద్ద అంబర్‌పేట్ సమీపానికి చేరుకోగానే, నియంత్రణ కోల్పోయిన కారు వాటర్ ట్యాంకర్‌ను వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనలో వేద ప్రకాష్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయన రెండున్నరేళ్ల కుమారుడు అర్జున్ కూడా మరణించాడు. కారులో ఉన్న మిగతా ముగ్గురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు, పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని, వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారని పోలీసులు తెలిపారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org