ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు !
ఆంధ్రప్రదేశ్ లో కుటుంబ మొత్తానికి ఒకే స్మార్ట్ కార్డు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అప్పుడు ఒక్కో పథకానికీ ఒక్కో కార్డు అవసరం ఉండదు అన్నారు. ఒకే స్మార్ట్ ఫ్యామిలీ కార్డుతో కుటుంబ సభ్యులకు అందే పథకాలు, అర్హతల వివరాలు అన్నీ తెలుస్తాయి అని చెప్పారు. స్మార్ట్ ఫ్యామిలీ కార్డులో కేంద్ర, రాష్ట్ర పథకాల లబ్ధి మొత్తాలు, ఏ పథకాలకు అర్హత ఉంది వంటి 25 రకాల వివరాలు అంటే ఆధార్, రేషన్, పెన్షన్, స్కాలర్‌షిప్‌లు, వాక్సినేషన్ వంటి వివరాలు ఉంటాయి. QR కోడ్ స్కాన్ చేసి వాటిని తెలుసుకోవచ్చు. 1.4 కోట్ల కుటుంబాల వివరాల్ని 2026 జూన్ లోగా స్మార్ట్ ఫ్యామిలీ కార్డుల రూపంలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కింద జారీ చేస్తారు.