రెలిజియస్ సైన్స్ బోధిస్తున్న మోజ్తాబా ఖమేనీ వీడియోను విడుదల చేసిన ఐఆర్ఐబీ


రాన్ కొత్త సుప్రీం నేత అయతొల్లా మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డాడని కొందరు, మరణించాడని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరాన్ ప్రభుత్వం ఆయన వీడియోను తొలిసారిగా మీడియాకు విడుదల చేసింది. ఇరాన్ కొత్త సుప్రీం నేతగా ఎంపికైన అయతొల్లా మొజ్తాబా ఖమేనీ ఆచూకీపై ప్రపంచ వ్యాప్తంగా సస్పెన్స్ కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఆయన వీడియోను ఇరాన్ ప్రభుత్వ మీడియా దీన్ని విడుదల చేయడం చర్చనీయంశంగా మారింది. కాగా ఆ వీడియోలో కొంతమంది విద్యార్థులకు 'రెలిజియస్ సైన్స్'పై అరబిక్ లో  మొజ్తాబా బోధన చేస్తున్నట్టు అందులో కనిపిస్తోంది. ఈ వీడియో ఒక నిమిషం 19 సెకండ్ల నిడివి కలిగి ఉంది. కాగా దీన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా అయిన ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్ కాస్టింగ్ విడుదల చేసింది. అయితే దాన్ని ఎక్కడ రికార్డు చేశారు అనేది మాత్రం తెలియలేదు. అయితే ఇది చారిత్రక రికార్డు కోసం భద్రపరిచిన వీడియో కావచ్చనే ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి.'రెలిజియస్ సైన్స్ బోధిస్తున్న అయతొల్లా మొజ్తాబా ఖమేనీ వీడియాను తొలిసారి పబ్లిష్ చేస్తున్నాం' అంటూ ప్రభుత్వ మీడియా అయిన ఐఆర్ఐబీ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేసింది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org