Ad Code

మార్చి 6 నుంచి కొనుగోలుకు వచ్చిన మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్


మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ మార్చి 6 వ తేదీ నుంచి కొనుగోలుకు వచ్చింది. ఈ మొబైల్లో లేటెస్ట్ టెక్నాలజీ తో కూడిన 7s Gen 4 చిప్ సెట్ తోపాటు మెరుగైన కెమెరా పనితీరు. బ్యాటరీ సామర్థ్యం వంటివి అప్డేట్ అయి ఉన్నాయి. ఈ మొబైల్ లో ఆకర్షణీయమైన ఫీచర్లు మాత్రమే కాకుండా అతి తక్కువ ధరలో దీనిని కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడింది. ఈ మొబైల్లో 6 పాయింట్స్ 78 అంగుళాల HD AMOLED డిస్ప్లే ని చూడవచ్చు. ఇది 1.5 k Resolution తో పనిచేస్తుంది. అలాగే 5200 nits బ్రైట్నెస్ కలిగి ఉండి అత్యధిక కాంతివంతంగా డిస్ప్లే అవుతుంది. ఈ డిస్ప్లే పై కార్నింగు గొరిల్లా క్లాస్ 7i ప్రొటెక్షన్ ను ఇస్తుంది. అలాగే ఈ మొబైల్లో 7s Gen 4 చిప్ సెట్ ఉండనుంది. దీంతోపాటు 12gb రామ్, 256 జీబీ స్టోరేజ్ ఉంచారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత UI తో పనిచేస్తుంది. ఐదు సంవత్సరాలపాటు OS అప్డేట్ అవుతూ లేటెస్ట్ టెక్నాలజీని పొందవచ్చు. ఇందులో 50 MP మెయిన్ కెమెరా ఉండనుంది. అలాగే 13 MP అల్ట్రా వైడ్ సెన్సార్ పనిచేస్తుంది.32 MP ఫ్రంట్ కెమెరాతోపాటు వీడియో కాలింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ కెమెరాలతో ఫోటోలు మాత్రమే కాకుండా ఫోర్ కే వీడియో రికార్డింగ్ చేసుకునేందుకు చాన్స్ ఉంది. ఇందులో 7000 mAh బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీ 68 W ఫాస్టెస్ట్ చార్జింగ్తో సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో నేటితరం యూత్ కు అనుగుణంగా ఫీచర్లు కూడా ఉన్నాయి. బ్లూటూత్ 6.0, వైఫై 6e, ఎన్ ఎఫ్ సి, జిపిఎస్ వంటివి ఫాస్ట్ కనెక్టింగ్ తో సపోర్టు ఇస్తుంది. ఈ మొబైల్ 8 జిబి రామ్ 256 జీబీ స్టోరేజ్ తో కొనుగోలు చేయాల్సి వస్తే ధర రూ.26,999 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ కాన్ఫిగరేషన్ పెరిగితే ధర మారే అవకాశం ఉంటుంది. మిడ్ రేంజ్ పీపుల్స్ కొత్తగా మొబైల్స్ కొనాలని అనుకుంటే ఇదే బెస్ట్ ఆప్షన్ అని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.

Post a Comment

0 Comments

Close Menu