రియల్ మీ సీ83 5జీని విడుదల : నేటి నుంచి అమ్మకాలు ప్రారంభం
దేశీయ మార్కెట్లో రియల్ మీ సీ83 5జీని విడుదల చేసింది. ఈరోజు నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ప్రారంభమవుతాయి. దీన్ని ఫ్లిప్కార్ట్ , రియల్ మీ అధికారిక వెబ్‌సైట్ మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. తక్కువ ధరలో 5G కనెక్టివిటీతో పాటు భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే, మెరుగైన పనితీరు అందించేలా ఈ ఫోన్‌ను రూపొందించారు. ఎక్కువసేపు ఫోన్ ఉపయోగించే వినియోగదారులు, గేమింగ్, వీడియో వీక్షణ ఇష్టపడే వారికి ఇది మంచి ఎంపికగా ఉండొచ్చని కంపెనీ చెబుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,000mAh సామర్థ్యం గల భారీ 'టైటాన్' బ్యాటరీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. కంపెనీ వివరాల ప్రకారం, ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 37 రోజుల వరకు స్టాండ్‌బై టైమ్, అలాగే 27 గంటలకు పైగా వీడియో ప్లేబ్యాక్ అందిస్తుంది. దీని బ్యాటరీ పనితీరు సుమారు ఆరు సంవత్సరాల వరకు స్థిరంగా ఉంటుందని రియల్ మీ పేర్కొంది.ఈ ఫోన్‌లో 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా ఇతర చిన్న డివైసులను కూడా ఛార్జ్ చేయవచ్చు. 6.8 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే అందించారు. ఈ డిస్‌ప్లేకు 144Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోలింగ్, గేమింగ్ మరియు వీడియోలు చూడడం మరింత స్మూత్‌గా ఉంటుంది. అలాగే పెద్ద స్క్రీన్ వల్ల సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడడానికి కూడా మంచి అనుభవం లభిస్తుంది. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 6300 5G చిప్‌సెట్ అమర్చారు. ఇది రోజువారీ పనులతో పాటు సాధారణ గేమింగ్‌కు సరైన పనితీరును అందిస్తుంది. ఇందులో వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉండటంతో మల్టీటాస్కింగ్ మరింత సులభంగా ఉంటుంది. ఒకేసారి అనేక యాప్స్ ఉపయోగించినా ఫోన్ స్మూత్‌గా పనిచేసేలా రూపొందించారు. ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్ వెనుక భాగంలో 13MP ప్రైమరీ కెమెరా ఇవ్వబడింది. ఇది రోజువారీ ఫోటోలు, సోషల్ మీడియా కోసం సరిపడే ఫోటోలను తీసేందుకు అనుకూలంగా ఉంటుంది. ముందు భాగంలో 5MP ఫ్రంట్ కెమెరా అందించారు. అలాగే AI కెమెరా ఫీచర్లు, నైట్ మోడ్, HDR వంటి ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.