ఫిఫా ప్రపంచ కప్ 2026 సమరం : ఇరాన్ ఆటగాళ్ల ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వలేమన్న ట్రంప్


ఫిఫా ప్రపంచ కప్ 2026 సమరం ఈ ఏడాది జూన్ 11 నుంచి జులై 19 వరకు జరగనుంది. దీనికి అమెరికా, కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. అయితే పశ్చిమాసియాలో ఇరాన్‌తో ఇజ్రాయెల్, అమెరికా తీవ్ర స్థాయిలో యుద్ధం చేస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ జట్టు ఫిఫా ప్రపంచ కప్‌లో పాల్గొనలేమని ఇప్పటికే తేల్చి చెప్పింది. అయితే మధ్యప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ఇరాన్ జట్టు ఫిఫా వరల్డ్ కప్ ఆడేందుకు స్వాగతిస్తామని ఫిఫా చీఫ్ జియాని పేర్కొన్నారు. తాజాగా ఆయన వ్యాఖ్యలపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. 'ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు ఫిఫా ప్రపంచ కప్‌లో ఆడటం, ఆడకపోవడం అనేది వారిష్టం. యుద్ధం పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ ఆటగాళ్లు అమెరికా వస్తే మాత్రం వారి ప్రాణాలకు, భద్రతకు మేము ఎలాంటి గ్యారెంటీ ఇవ్వలేం. కాబట్టి వీలైనంత వరకు ఇరాన్ ప్రపంచ కప్‌నకు దూరంగా ఉండటమే మంచిది' అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు.
Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org