ఢిల్లీలో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు !


ఢిల్లీలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఎయిర్ ఫోర్స్ స్కూల్‌కు ఈరోజు ఉదయం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు, బాంబ్ స్క్వాడ్స్ అప్రమత్తమై భద్రతను కట్టుదిట్టం చేశారు. ధౌలా కువాన్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, లోధి రోడ్‌లోని ఎయిర్ ఫోర్స్ బాల్ భారతి స్కూల్‌లకు ఈమెయిల్‌ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. భద్రతా సంస్థలు అప్రమత్తమై రెండు పాఠశాలల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులను బయటకు పంపి తనిఖీలు చేపట్టారు. బాంబ్ బెదిరింపులతో పేరెంట్స్, స్టూడెంట్స్ భయాందోళనకు గురయ్యారు. స్కూళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్ (DFS) అధికారి తెలిపారు. క్యాంపస్‌లో పేలుడు పరికరాలు అమర్చబడి ఉన్నాయని ఈమెయిల్ సందేశాన్ని పాఠశాల యాజమాన్యం ఉదయం అధికారులకు తెలియజేశారని చెప్పారు. మరోవైపు ఈమెయిల్ మూలాన్ని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదన్నారు. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాల ప్రాంగణాన్ని ఖాళీ చేయించినట్లు వెల్లడించారు. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారి వివరించారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org