పిల్లల ఆర్థిక భరోసాకు జీవన్ తరుణ్ పాలసీని తీసుకొచ్చిన ఎల్ఐసీ
పిల్లల లక్ష్యాలకు ఆర్థిక మద్దతుగా ఎల్ఐసీ జీవన్ తరుణ్ పాలసీని తీసుకొచ్చింది. ఈ పథకం నాన్-లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ కావడంతో స్టాక్ మార్కెట్ మార్పుల ప్రభావం ఉండదు. పరిమిత కాలం ప్రీమియం చెల్లించే విధంగా రూపొందించిన ఈ స్కీమ్‌లో రోజుకు సుమారు రూ.150 ఆదా చేస్తే, మెచ్యూరిటీ సమయంలో రూ.26 లక్షల వరకు పొందే అవకాశం ఉంటుంది. పిల్లలు 20 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్నప్పుడు ప్రతి ఏడాది కొంత మొత్తాన్ని అందిస్తారు. 25 ఏళ్ల వయస్సులో మిగిలిన మొత్తాన్ని బోనస్‌తో కలిసి చెల్లిస్తారు. దీంతో ఉన్నత విద్య, వివాహం వంటి కీలక అవసరాలకు ఆర్థిక భరోసా కలుగుతుంది. ఈ పాలసీని పిల్లల వయస్సు ఒక సంవత్సరం నుంచే ప్రారంభించవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడితో పిల్లల భవిష్యత్తుకు సురక్షితమైన నిధి సృష్టించాలనుకునే తల్లిదండ్రులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.