Ad Code

తెలంగాణ ఎడ్ సెట్ 2026 పరీక్ష షెడ్యూల్ విడుదల


తెలంగాణలో బీఈడీ కాలేజీల్లో రెండేళ్ల కోర్సుకు ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే ఎడ్ సెట్ 2026 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈ షెడ్యూల్ ను ఎడ్ సెట్ కు చైర్మన్ గా ఉన్న కాకతీయ యూనివర్శిటీ వీసీ, ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి విడుదల చేశారు. ఇందులో పరీక్షలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు తేదీలు, పరీక్ష రుసుములు, పరీక్ష తేదీ ఇలా.. పలు వివరాలు ఉన్నాయి. డిగ్రీ విద్యార్హతతో నిర్వహించే ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు వీటిని సమగ్రంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ ఏడాది తెలంగాణలో ఎడ్ సెట్ పరీక్ష కోసం నోటిఫికేషన్ విడుదలైంది. దీని ప్రకారం ఫిబ్రవరి 23 అంటే ఇవాళ్టి నుండి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్ లో అప్లికేషన్లు సమర్పించేందుకు గడువు ఇచ్చారు. అలాగే రూ.250 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే రూ. 500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 27వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. అనంతరం మే 12న రెండు సెషన్లలో ఎడ్ సెట్ ఎంట్రన్స్ పరీక్ష జరగబోతోంది. ఈ పరీక్ష పూర్తిగా ఆన్ లైన్ విధానంలోనే జరుగుతుంది. అనంతరం మే 30న ఎడ్ సెట్ ఎంట్రన్స్ పరీక్ష ఫలితాలు విడుదల చేస్తారు. ఈ పరీక్షకు దరఖాస్తులు కేవలం ఆన్ లైన్లో సమర్పించాలి. అలాగే పరీక్ష ఫీజును మాత్రం టీజీ ఆన్ లైన్ సెంటర్లతో పాటు పేమెంట్ గేట్ వేల ద్వారా కూడా చెల్లించవచ్చు. ఈ పరీక్షలకు అర్హతలు, సిలబస్ ఇతర వివరాల కోసం అభ్యర్ధులు https://edcet.tgche.ac.in/ వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది. 

Post a Comment

0 Comments

Close Menu