Ad Code

ఇరాన్‌లో వున్న భారతీయ పౌరులందరూ వీలైనంత త్వరగా ఆ దేశాన్ని విడిచి రావాలి !


మెరికా-ఇరాన్ మధ్య అణు ఒప్పందంపై చర్చలు జరుగుతుండగా, మరోవైపు అమెరికా తన సైనిక బలగాలను (ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు, యుద్ధ విమానాలు) ఈ ప్రాంతంలో మోహరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అణు ఒప్పందంపై కఠిన గడువు విధించడంతో యుద్ధ భయాలు నెలకొన్నాయి. దీనికి తోడు ఇరాన్ యూనివర్సిటీల్లో విద్యార్థుల నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకునే భారత్ ఈ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్‌లో వున్న భారతీయ పౌరులందరూ వీలైనంత త్వరగా ఆ దేశాన్ని విడిచి రావాలని కేంద్ర  ప్రభుత్వం జారీ చేసిన తాజా అడ్వైజరీలో కోరింది. కమర్షియల్ విమానాలు లేదా అందుబాటులో ఉన్న ఏ ఇతర రవాణా మార్గాల ద్వారానైనా వెంటనే భారత్‌కు తిరిగి రావాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. అలాగే నిరసనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని, స్థానిక మీడియాను గమనిస్తూ టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపుల్లో ఉండాలని కోరింది పాస్‌పోర్ట్, వీసా మరియు ఇతర గుర్తింపు పత్రాలను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలని, ప్రయాణ ఏర్పాట్లలో ఇబ్బందులు ఎదురైతే ఎంబసీని సంప్రదించాలని తెలిపింది. భారతీయ పౌరులకు సహాయం అందించడానికి టెహ్రాన్‌లోని భారత ఎంబసీ +98 9128109115, +98 9128109109, +98 9128109102 +98 9932179359  ఫోన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది.  ఇరాన్‌లో ఉన్న భారతీయులందరూ (విద్యార్థులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు) తమ వివరాలను https://www.meaers.com/request/home పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. ఒకవేళ అక్కడ ఇంటర్నెట్ అంతరాయం ఉంటే, భారత్‌లోని వారి కుటుంబ సభ్యులు ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu