Ad Code

గెలిచే మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై ఓడిన పాకిస్థాన్ !


సౌతాఫ్రికా గడ్డపై పాకిస్థాన్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పాకిస్థాన్ ఓటమిపాలైంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే పాకిస్థాన్ 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో హ్యారీస్ రౌఫ్ పేలవ బౌలింగ్ ప్రదర్శన కారణంగా పాకిస్థాన్ ఓటమిపాలైంది. చివర్లో హ్యారీస్ రౌఫ్ కట్టడిగా బౌలింగ్ చేసి ఉంటే.. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ సునాయస విజయాన్నందుకునేది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 206 పరుగులు చేసింది. సయీమ్ ఆయుబ్(57 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 98 నాటౌట్) తృటిలో శతకం చేజార్చుకోగా.. ఇర్ఫాన్ ఖాన్(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) మెరుపులు మెరిపించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో బార్ట్‌మన్, దయ్యాన్ రెండేసి వికెట్లు తీయగా.. జార్జ్ లిండే ఓ వికెట్ తీసాడు. అనంతరం సౌతాఫ్రికా 19.3 ఓవరల్లో 3 వికెట్లకు 210 పరుగులు చేసి గెలుపొందింది. రీజా హెండ్రీక్స్(63 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 117) శతకం బాదగా.. రాసీ వాన్ డెర్ డస్సెన్(38 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 66 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. పాక్ బౌలర్లలో జహందాద్ ఖాన్ రెండు వికెట్లు తీయగా.. అబ్బాస్ అఫ్రిది ఓ వికెట్ పడగొట్టాడు. 12 బంతుల్లో సౌతాఫ్రికా విజయానికి 19 పరుగులు అవసరమవ్వగా.. 19 ఓవర్ వేసిన హ్యారీస్ రౌఫ్ 13 పరుగులు ఇచ్చాడు. క్లాసెన్ ఓ బౌండరీ బాదగా.. డస్సెన్ ఓ సిక్స్ కొట్టాడు. ఆఖరి ఓవర్‌లో అబ్బాస్ అఫ్రిది కట్టడిగా బౌలింగ్ చేసే ప్రయత్నం చేసి డస్సెన్ సిక్స్‌తో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. హ్యారీస్ రౌఫ్ కట్టడిగా వేసుంటే ఈ మ్యాచ్‌లో పాక్‌కు విజయం దక్కేది. మొత్తం 4 ఓవర్లు బౌలింగ్ చేసిన హ్యారీస్ రౌఫ్ 57 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీయలేకపోయాడు. అతని వైఫల్యం పాక్ విజయవకాశాలను దెబ్బతీసింది.

Post a Comment

0 Comments

Close Menu