కాగ్‌ చీఫ్‌గా కె.సంజయ్ మూర్తి ప్రమాణస్వీకారం


భారత కంప్ట్రోలర్‌ అండ్‌ జనరల్‌ (కాగ్‌) చీఫ్‌గా ఐఎఎస్‌ అధికారి కె.సంజయ్ మూర్తి ప్రమాణం చేశారు. గురువారం ఉదయం 10.00 గంటలకు రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాగ్‌ చీఫ్‌గా ఆయనతో ప్రమాణం చేయించారు. కాగ్‌ చీఫ్‌గా గిరీష్‌ చంద్ర ముర్ము పదవీకాలం బుధవారంతో ముగిసింది. దీంతో హిమాచల్‌ప్రదేశ్‌ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్‌ ఐఎఎస్‌ అధికారి కె.సంజయ్ మూర్తిని కాగ్ చీఫ్‌గా నియమిస్తున్నట్లు కేంద్రం సోమవారం నోటిఫిేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న ఆయనను ఈ పదవికి ఎంపిక చేసింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తదితరులు పాల్గొన్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org