లాయర్‌ను కొడవలితో నరికిన అసిస్టెంట్ !

మిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఒక లాయర్‌పై అతడి అసిస్టెంట్‌ కొడవలితో దాడి చేశాడు. కోర్టు బయట అంతా చూస్తుండగా తల, మెడపై నరికాడు. తీవ్రంగా గాయపడిన ఆ న్యాయవాది ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.  బుధవారం ఉదయం జిల్లా కోర్టు బయట న్యాయవాది కన్నన్‌పై అతడి సహాయకుడు ఆనంద్‌ కుమార్‌ కొడవలితో దాడి చేశాడు. ఆ లాయర్‌ తల, మెడపై నరికాడు. దీంతో తల, మెడ, ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. రక్తం కారుతూ రోడ్డుపై పడిన లాయర్‌ కన్నన్‌ను తోటి న్యాయవాదులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. కాగా, లాయర్‌పై దాడి చేసిన నిందితుడు ఆనంద్‌ కుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వ్యక్తిగత శతృత్వమే ఈ దాడికి కారణమని తెలిపారు. వారిద్దరి మధ్య గతంలో వ్యక్తిగత వివాదాలు ఉన్నాయని చెప్పారు. పోలీస్‌ స్టేషన్‌, కోర్టుకు వెళ్లిన వారిద్దరూ ఆ తర్వాత రాజీపడ్డారని పోలీస్‌ అధికారి వెల్లడించారు. మరోవైపు ఈ సంఘటనపై న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని, లాయర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. కాగా, కొందరు వ్యక్తులు రికార్డ్‌ చేసిన వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org