హైదరాబాద్‌లోని అజంపురా వద్ద మరో క్లాక్‌ టవర్‌ !


హైదరాబాద్‌ లోని చాదర్‌ఘాట్‌ పరిధిలో అజంపురా వద్ద కొత్తగా క్లాక్‌ టవర్‌ను నిర్మాణ పనులు చేపట్టారు. దాదాపు నిర్మాణ పనులు పూర్తై ఈ నెలలోనే ప్రారంభించనున్నట్లు జీహెచ్‌ఎంసీ ఏఈ మల్లికార్జున్‌ తెలిపారు. 30 ఫీట్ల ఎత్తులో నాలుగు వైపులా గడియారం ఉంటుంది. చుట్టుపక్కల లైట్లు.. టవర్‌ చుట్టూ అహ్లాదకర వాతావరణం ఉండేందుకు గడ్డితోపాటు మొక్కలు నాటారు. నాలుగు వైపులా మార్గం ఒకవైపు చాదర్‌ఘాట్‌, డబీర్ పురా, యాకత్‌పురా, అజంపురా వైపు వెళ్తుంది. క్లాక్ టవర్‌ ఏర్పాటుకు రూ. 75 లక్షలు కేటాయించారని ఏఈ మల్లికార్జున్ తెలిపారు. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org