కెనడాలోని హిందూ దేవాలయం దాడిపై ప్రధాని మోడీ ఆగ్రహం !
కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ ఆలయంపై ఖలిస్తాన్ వాదులు దాడి చేశారు. ఆలయంలో ఉన్న వారిపై కర్రలతో దాడి చేశారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ఈ ఘటనను ఖండించారు. అయితే ఈ ఘటనపై కెనడాలోని భారత హైకమిషన్ వివరణ ఇచ్చింది. టొరంటో సమీపంలోని బ్రాంప్టన్‌లోని హిందూ సభ మందిర్‌తో కలిసి ఏర్పాటు చేసిన కాన్సులేట్ క్యాంప్ బయట ఈ దాడి జరిగింది. ఈవెంట్‌ల కోసం రక్షణ కల్పించాలని భారత ఎంబసీ అభ్యర్ధించింది. ఇది సాధారణ కాన్సులర్ ఫంక్షన్ అని, ఖలిస్తాన్ వేర్పాటువాదులు దాడి చేయడం దారుణమని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. కెనడాలోని హిందూ దేవాలయంపై జరిగిన దాడిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు. ఇటువంటి హింసాత్మక చర్యలు భారతదేశ నిర్ణయాన్ని ఎప్పటికీ బలహీనపరచవు. కెనడియన్ ప్రభుత్వం న్యాయాన్ని నిర్ధారిస్తుంది.. చట్ట నియమాన్ని సమర్థిస్తుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. ''కెనడాలోని హిందూ దేవాలయంపై ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మన దౌత్యవేత్తలను బెదిరించేందుకు పిరికిపంద ప్రయత్నాలు.. ఇటువంటి హింసాత్మక చర్యలు భారతదేశ నిర్ణయాన్ని ఎప్పటికీ బలహీనపరచవు. కెనడియన్ ప్రభుత్వం న్యాయాన్ని నిర్ధారిస్తుంది .. చట్ట నియమాన్ని సమర్థిస్తుందని మేము ఆశిస్తున్నాము.'' అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.