స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు తర్వాత బలంగా పుంజుకొన్నాయి. ఇంట్రాడే కనిష్ఠాల నుంచి సెన్సెక్స్ దాదాపు 1100 పాయింట్ల మేర రాణించగా.. నిఫ్టీ 24,200 ఎగువన ముగిసింది. మెటల్, ఫైనాన్షియల్, బ్యాంకింగ్, ఆటో స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. దీంతో నిన్నటి భారీ నష్టాల నుంచి సూచీలు గట్టెక్కాయి. సెన్సెక్స్ ఉదయం 78,542.16 పాయింట్ల (క్రితం ముగింపు 78,782.24) వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 78,296.70 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఆఖర్లో కొనుగోళ్ల మద్దతు కారణంగా పైకి ఎగబాకింది. చివరికి 694.39 పాయింట్ల లాభంతో 79,476.63 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 217 పాయింట్లు లాభపడి 24,213.30 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.11 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది.
0 Comments