సిద్ధరామయ్యకు లోకాయుక్త నోటీసు !


మైసూర్‌ అర్బన్‌ డెవెలప్‌మెంట్‌ అథారిటీ కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లోకాయుక్త పోలీసులు సమన్లు జారీ చేశారు. నవంబర్‌ 6న హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కూడా ధ్రువీకరించారు. ''ముడాకు సంబంధించి మైసూరు లోకాయుక్త నుంచి నోటీసులు అందాయి. నవంబర్‌ 6న హాజరవుతా'' అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇదే కేసులో ఆయన సతీమణి పార్వతీని అక్టోబర్‌ 25న లోకాయుక్త ప్రశ్నించింది. గతంలో ఇదే అంశంపై స్పందించిన ముఖ్యమంత్రి.. రాజకీయ విద్వేషాలు, కుట్రలకు తన భార్య బాధితురాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org