విమానాశ్రయాల కంటే మెరుగ్గా రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ !
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను కేంద్ర రైల్వే పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ సీఎం రమేశ్ సారథ్యంలోని స్టడీ టూర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సోమవారం పరిశీలించింది. ఈ సందర్భంగా సీఎం రమేశ్ మాట్లాడుతూ దేశంలో రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. వికసిత్ భారత్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రైల్వే స్టేషన్లను విమానాశ్రయాల కంటే మెరుగ్గా తీర్చిదిద్దుతామన్నారు. రాబోయే 50 సంవత్సరాలు పాటు రైల్వే స్టేషన్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. స్టేషన్‌లో పనులను పరిశీలించిన బృందం.. అధికారులకు పలు సూచనలు చేసింది మంగళవారం సికింద్రాబాద్‌లోనూ పనులు పరిశీలించి.. సమావేశం ఏర్పాటు చేసి ఒక నివేదిక రూపొందించి పార్లమెంట్‌కు అందజేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.