మూసీ నిర్వాసితులతో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సమావేశం


మూసీ సుందరీకరణ అంశంలో ప్రభుత్వంలోని పెద్దలు ఒక్కోలా మాట్లాడుతున్నారనే ఆందోళన నిర్వాసితుల్లో ఉందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. చైతన్యపురిలోని వెంకటసాయినగర్‌లో మూసీ నిర్వాసితులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుందరీకరణ పేరుతో మూసీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లను తొలగించాల్సి అవసరం ఉందా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిర్వాసితులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాత సుందరీకరణపై నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org