విజయవాడ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ !


సరా సెలవులతోపాటు ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల నేపథ్యంలో విజయవాడ రైల్వేస్టేషన్‌ జనంతో కిటకిటలాడుతోంది. దుర్గమ్మను దర్శించుకున్నవారితో పాటు నగరం నుంచి సొంత ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులతో స్టేషన్‌లో రద్దీ నెలకొంది. ఆదివారం మధ్యాహ్నం విశాఖపట్నం వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలో చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులకు గురయ్యారు. కూర్చోవడానికి స్థలం లేక రైలు కారిడార్లలో, ఫుట్‌బోర్డు మీద నిల్చొని ప్రయాణిస్తున్నారు. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org