ప్రోమేట్ నుంచి బ్లూటూత్ స్పీకర్ లాంచ్ !


ప్రోమేట్ టెక్నాలజీస్ ఇండియాలో సరికొత్త సరికొత్త మాగ్నెటిక్  బ్లూటూత్ స్పీకర్ ను లాంచ్ చేసింది. ఈ బ్లూటూత్ స్పీకర్ ను సరికొత్త డిజైన్, పవర్ ఫుల్ సౌండ్ అందించే డైనమిక్ స్పీకర్ తో అందించింది. ఈ స్పీకర్ ను రూ. 1,999 ధరతో విడుదల చేసింది. ఈ స్పీకర్ ఈరోజు నుంచి అమెజాన్ ఇండియా ద్వారా సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది. ఈ కొత్త స్పీకర్ ను HD సౌండ్ అందించే 40mm డైనమిక్ స్పీకర్ తో అందించింది. ఈ స్పీకర్ చూడటానికి చిన్నగా కనిపించినా పవర్ ఫుల్ సలాండ్ అందిస్తుందని ప్రోమేట్ తెలిపింది. Bluetooth 5.3 తో సీఎం లెస్ కనెక్టివిటీ అందిస్తుంది. అంతేకాదు, ఇది మల్టీ ఫంక్షనల్ బటన్ మరియు మంచి బేస్ సపోర్ట్ తో వస్తుంది. ఈ స్పీకర్ ఓవరాల్ గా 12 గంటల ప్లే టైం అందించే 700 mAh బిగ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ స్పీకర్ అన్ని ఐఫోన్ లకు బాగా సరిపోయే విధంగా మేగ్ సేఫ్ సపోర్ట్ మెటల్ రింగ్ తో కూడా జతగా వస్తుంది. ఈ స్పీకర్ ట్రూ వైర్లెస్ స్టీరియో సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. అంటే, రెండు స్పీకర్ లను లెఫ్ట్ అండ్ రైట్ గా సెట్ చేసుకునే ఫీచర్ ను కలిగి ఉంటుంది. ఈ కొత్త స్పీకర్ ను మంచి కాలింగ్ ను కూడా అందిస్తుందని ప్రోమేట్ తెలిపింది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org