Ad Code

వాము ఆకులు - ఆరోగ్య ప్రయోజనాలు !


యుర్వేదంలో వాము ఆకులను ప్రాచీన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. వీటిని అనేక రకాల పోషకాలు దాగి వున్నాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. దీని అజ్వైన్‌ అని కూడా పిలుస్తారు. వామును గింజలను వంటల్లోకి ఉపయోగిస్తారు. అంతేకాకుండా వాము తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుందని భావిస్తారు. కానీ ఇది కేవలం జీర్ణవ్యస్థను మాత్రమే కాకుండా మరి కొన్ని ఆరోగ్యలాభాలను కూడా అందిస్తుంది. వాము ఆకులు తినడం వల్ల గ్యాస్‌, అజీర్ణం, అల్సర్‌ వంటి సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గాలనుకొనేవారు వాము ఆకులు తినడం వల్ల జీవక్రియ రేటును పెంచుతుంది. అలాగే కొవ్వు కరిగించడంలో ఎంతో సహాయపడుతుంది. దీని వల్ల సులువు బరువు తగ్గుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది. ఇది హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. అలాగే శ్వాసకోశాన్ని శుభ్రపరచడంలో కూడా వాము ఆకులు ఎంతో మేలు చేస్తాయి. తరుచు గొంతు నొప్పి, ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారు వాము ఆకులు తీసుకోవడం చాలా మంచిది. చర్మ సమస్యలతో బాధపడేవారు కూడా వాము ఆకులు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దీని వల్ల మొటిమలు, మచ్చలు, ముడతలు తగ్గుతాయి. వాము ఆకులను నూనెలో కలుపుకొని తలకు మర్ధన చేయడం వల్ల తలనొప్పి తగ్గుతుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ సమస్యలతో బాధపడేవారికి వాము ఆకులు ఎంతో మేలు చేస్తాయి. ఇది షుగర్‌ లెవెల్స్‌ను నియంత్రిచడంలో సహాయపడుతాయి. దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు రాకుండా సహాయపడుతుంది. వాము ఆకులను సలాడ్‌లో కలిపి తినడం వల్ల ఆహారం ఎంతో రుచికరంగా ఉంటుంది. అలాగే శరీరానికి కావాల్సిన విటమిన్‌లు, మినర్సల్‌ లభిస్తాయి. మాంసం వంటలలో వాము ఆకులను వేయడం వల్ల మాంసం మృదువుగా మారుతుంది. ఇది మాంసంలోని కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. దీని వల్ల చెడు కొలెస్ట్రాల్‌ శరీరంలోకి చేరకుండా ఉంటుంది. ఆహారంలో మాత్రమే కాకుండా చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వీటిని దంచి ముఖానికి రాసుకోవడం వల్ల ముఖం పై మచ్చలు, మొటిమలు కలగకుండా ఉంటాయి. 

Post a Comment

0 Comments

Close Menu