మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ కన్నుమూత !
మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి సతీమణి కావలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ కన్నుమూశారు. చెన్నై లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 6.15కు తుదిశ్వాస విడిచారు. చాలా సున్నిత స్వభావం కలిగిన రాజకీయవేత్తగా ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. అయితే, ఇటీవలే ఆమె కుమారుడు మాగుంట విజయ్‌రెడ్డి ప్రాణాలు కోల్పోగా సరిగ్గా ఐదు నెలలు కూడా గడవక ముందే పార్వతమ్మ తీవ్ర అనారోగ్యంతో తుది శ్వాస విడవడం మాగుంట కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె మరణం పట్ల సీఎం చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సంతాపాన్ని తెలిపారు. గురువారం నెల్లూరులో పార్వతమ్మ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.