గ్రామీణ విద్యకు వాయిస్‌ టెక్నాలజీ దన్ను : అమెజాన్‌ ఇండియా డైరెక్టర్‌ (అలెక్సా) ఆర్‌ఎస్‌ దిలీప్‌


గ్రామీణ ప్రాంతాల్లో విద్యాబోధనలో వాయిస్‌ టెక్నాలజీ కీలక పాత్ర పోషించగలదని అమెజాన్‌ ఇండియా డైరెక్టర్‌ (అలెక్సా) ఆర్‌ఎస్‌ దిలీప్‌ తెలిపారు. అయితే, ఇప్పటికీ దీని ఉపయోగం గురించి చాలా మందికి తెలియదని, ఈ నేపథ్యంలోనే అవగాహన కల్పన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నాగాలాండ్‌లోని కొన్ని ప్రభుత్వ పాఠశాల్లో అలెక్సా ఎనేబుల్డ్‌ ఎకో స్మార్ట్‌ స్పీకర్లను ఉపయోగిస్తుండటమనేది వాయిస్‌ టెక్నాలజీ వల్ల చేకూరే ప్రయోజనాలను తెలుసుకునేందుకు తోడ్పడగలదని చెప్పారు. చదువుపై విద్యార్థుల్లో ఆసక్తి పెరగడానికి కూడా ఈ సాంకేతికత దోహదపడుతోందని దిలీప్‌ పేర్కొన్నారు. వాయిస్‌ టెక్నాలజీ మెరుగుపడే కొద్దీ విద్యారంగంలో మరిన్ని వినూత్న సాధనాలు అందుబాటులోకి రాగలవని, గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభ్యాసం రూపురేఖలు మార్చగలవని ఆయన చెప్పారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org