కంగ్రాట్స్‌ నిహారిక అని మహేశ్‌బాబు ట్వీట్‌ !


నూతన నటీనటులతో తాజాగా ఆమె నిర్మించిన చిత్రం 'కమిటీ కుర్రోళ్ళు'. గ్రామీణ నేపథ్యంలో సాగే విభిన్నమైన కథతో దీనిని రూపొందించారు. తాజాగా ఈ సినిమా గురించి నటుడు మహేశ్‌బాబు ట్వీట్‌ చేశారు. నిహారికకు అభినందనలు తెలిపారు. ''కమిటీ కుర్రోళ్ళు' గురించి చాలా మంచి విషయాలు వింటున్నా. సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టినందుకు, తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నందుకు కంగ్రాట్స్‌ నిహారిక. త్వరలోనే ఈ చిత్రాన్ని చూస్తా'' అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఇది సినీప్రియుల దృష్టిని ఆకర్షిస్తుంది. అగ్రనటుడు అయినప్పటికీ చిన్న చిత్రాలను ప్రోత్సహిస్తున్నారని పలువురు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org