దక్షిణ కొరియాలోని సియోల్ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. ఇందులో భాగంగా ఆయన ఎల్ఎస్ (ఎల్‌జీ) గ్రూప్ ఛైర్మన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో విద్యుత్ కేబుల్, గ్యాస్, ఇంధన, బ్యాటరీల ఉత్పత్తిలో పెట్టుబడులపై చర్చించారు. త్వరలో తెలంగాణలో పర్యటించేందుకు ఎల్‌ఎస్ గ్రూప్ బృందం అంగీకరించింది. మరోవైపు కొరియా టెక్స్‌టైల్ పరిశ్రమ సమాఖ్యతో సీఎం రేవంత్‌రెడ్డి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్కుకు కొరియా పెట్టుబడులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిది రోజుల పాటు అమెరికాలో సీఎం జరిపిన పర్యటన విజయవంతమైందని తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశాల ఫలితంగా 19 కంపెనీల ప్రతినిధులు తెలంగాణలో రూ.31,532 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రతినిధి బృందం అమెరికాలో దాదాపు 50కి పైగా వాణిజ్య సంస్థలతో సమావేశమైందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, విద్యుత్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో పెట్టుబడులు పెట్టే దిశగా పలు సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయని తెలిపింది.
0 Comments