రాగులు మధుమేహ వ్యాధిగ్రస్తుల కు చక్కటి ఔషధం !
ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే ముఖ్యమైన ధాన్యాలలో రాగులు కూడా ఒకటి. పలు ఆహార పదార్థాలతో వివిధ మార్గాలలో వీటిని ఉపయోగిస్తారు. ముఖ్యంగా రాగులతో పిండి తయారు చేసి.. రాగి ముద్ద, రాగి గంజి, అంబలి, రాగి రోటి ఇలా పలు రకాలుగా తయారు చేసుకుని తింటూ ఉంటారు. ముఖ్యంగా రాగులలో మనకు క్యాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కటి ఔషధం. రాగులతో తయారు చేసిన గంజి పిల్లలకు ప్రతిరోజు ఇవ్వడం వల్ల వారి ఎముకల పటిష్టానికి చాలా ఉపయోగకరమని చెప్పవచ్చు. ప్రత్యేకించి వృద్ధులు, మహిళలు తమ ఎముకలకు బలాన్ని అందించాలంటే తప్పకుండా రాగులతో తయారుచేసిన గంజి తీసుకోవాలి. రాగి పొడిలో మనకు ప్రోటీన్లు, విటమిన్ ఏ, బి , సి తో పాటు మినరల్స్ కూడా లభిస్తాయి. ఎముకల బలానికి సహాయ పడడమే కాకుండా ఇమ్యూనిటీని పెంచడానికి కూడా సహాయపడతాయి. ఈ జావ వల్ల జీర్ణశక్తి మెరుగు పడుతుంది. రాగుల్లో ఉండే అమైనో ఆమ్లాలు.. ట్రిప్టో ఫాన్ ఆకలిని తగ్గిస్తుంది.. క్రమంగా బరువు అదుపులో ఉంటుంది. గుండె బలహీనత, ఉబ్బసాన్ని కూడా తగ్గిస్తుంది. నిత్యం రాగులు తీసుకోవడం వల్ల చర్మం మెరుస్తూ మృదువుగా మారుతుంది. దీంతో 60లో కూడా 16 లా కనిపించవచ్చు. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది.