జూలై 8న సిఎంఎఫ్ ఫోన్ 1 విడుదల !


జూలై 8న నథింగ్ సబ్ బ్రాండ్ అయిన సిఎంఎఫ్ ఫోన్ 1ను దేశీయ మార్కెట్లో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ ను వినూత్నమైన డిజైన్ తో తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో వెనక రౌండ్ సర్క్యులర్ నాబ్, డిటాచబుల్ స్క్రూ ఉన్నట్లు చూపించింది.  ఫ్లిప్ కార్ట్  ఈ సిఎంఎఫ్ ఫోన్ కోసం కొత్తగా అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా, ఈ ఫోన్ Dimensity 7300 చిప్ సెట్ తో పని చేస్తుందని తెలిపింది. ఇది 4nm క్లాస్ ప్రోసెసర్ మరియు Arm Mali-G615 GPU తో వస్తుంది. ఈ చిప్ సెట్ కనెక్టివిటీ పరంగా Wi-Fi 6E మరియు Bluetooth 5.4 సపోర్ట్ తో ఉంటుంది. ఇది మాత్రమే కాదు, 4K HDR వీడియో షూట్ చేయగలిగే సత్తా మరియు మంచి డిస్ప్లే సపోర్ట్ ను కూడా అందిస్తుంది. ఈ చిప్ సెట్ కి జతగా ఈ ఫోన్ లో 8GB ర్యామ్ మరియు 8GB ర్యామ్ బూస్టర్ ఫీచర్ తో టోటల్ 16GB ర్యామ్ ఫీచర్ తో వస్తుందని కూడా కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో అందించిన మరొక ఫీచర్ ను కూడా కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ చాలా గొప్ప రిజల్యూషన్ మరియు కలర్స్ అందించగల Super AMOLED డిస్ప్లే ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లాంచ్ నాటికి ఈ ఫోన్ యొక్క చాలా కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లను కంపెనీ వెల్లడించే అవకాశం ఉండవచ్చు. అయితే, ఇప్పటికే చాలా మంది లీక్ స్టర్స్ ఈ ఫోన్ స్పెక్స్ ను అంచనా వేసి చెబుతున్నారు. కానీ, కంపెనీ అధికారికంగా అనౌన్స్ చేసే వరకూ ఇవన్నీ కూడా అంచనా ఫీచర్లు గానే పరిగణించబడతాయి.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org