బీఎస్‌ఎన్‌ఎల్ ఓ సూపర్ ఆఫర్ రూ.249 ప్లాన్ !
ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా (వీఐ) రీఛార్జ్ రేట్లను భారీగా పెంచేశాయి. దాదాపుగా 26 శాతం ధరలను పెంచాయి. పెరిగిన ధరలు జూలై 04వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ లకు షాక్ ఇస్తూ బీఎస్‌ఎన్‌ఎల్ ఓ సూపర్ ఆఫర్ ను తీసుకువచ్చింది. కొత్త రూ. 249 ప్లాన్‌ను ప్రారంభించింది. దీనిలో దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాలింగ్, మొత్తం 90GB డేటా, రోజుకు 2GBకి సమానం, రోజుకు 100 ఉచిత SMSలు పొందవచ్చు. వినియోగదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుని బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ఆఫర్ ను తీసుకువచ్చి్ంది. ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ ప్లాన్ ధరలను పెంచడంతో బీఎస్‌ఎన్‌ఎల్ తక్కువ ఖర్చుతో కూడిన ప్లాన్‌ను ప్రవేశపెట్టి కస్టమర్ల పట్ల తమకున్న నిబద్దతను చాటుకుంటుంది. అంతేకాకుండా వేరే కస్టమర్లను తమ వైపు అట్రాక్ట్ చేస్తుంది.