సినిమాటిక్ కెమెరాతో హానర్ 200 సిరీస్ 5జీ కొత్త స్మార్ట్ ఫోన్ !


హానర్ 200 సిరీస్ 5జీ కొత్తస్మార్ట్ ఫోన్ సిరీస్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ లను అద్భుతమైన సినిమాటిక్ కెమెరాతో తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ కొత్త ఫోన్ లను అమెజాన్ స్పెషల్ గా తీసుకు వస్తోంది. హానర్ 200 సిరీస్ 5జి స్మార్ట్ ఫోన్ లను గొప్ప కెమెరా సెన్సార్ మరియు దానికి తగిన సాఫ్ట్ వేర్ తో తీసుకు వస్తుందని చెబుతోంది. ఈ ఫోన్ లో కటింగ్ ఎడ్జ్ డిస్ప్లే టెక్నాలజీ ఉన్నట్లు హానర్ తెలిపింది. అయితే, వాస్తవానికి ఈ సిరీస్ నుంచి రెండు ఫోన్లను ఇప్పటికే గ్లోబల్ మార్కెట్ లో హానర్ విడుదల చేసింది. ఇప్పుడు ఇవే ఫోన్లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు భావిస్తున్నారు. హానర్ 200 సిరీస్ నుండి గ్లోబల్ మార్కెట్ లో హానర్ 200, హానర్ 200 ప్రో రెండు ఫోన్లు విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లు కూడా న్యూ స్టైల్ రియర్ కెమెరా బంప్ సెటప్ తో వచ్చాయి. ఈ రెండు ఫోన్లు కూడా చూడచక్కని డిజైన్ మరియు గొప్ప కెమెరా సెటప్ ను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్ లో క్వాడ్ కర్వ్డ్ ఫ్లోటింగ్ స్క్రీన్, స్నాప్ డ్రాగన్ లేటెస్ట్ ఫాస్ట్ ప్రోసెసర్, 4K రికార్డింగ్ మరియు గొప్ప ఫోటోలను చిత్రించగల కెమెరాలను కలిగి ఉంటుంది. వేగవంతమైన 100W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉంది 5100 mAh బిగ్ బ్యాటరీ కూడా వుంది. 


Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org