జగన్ మీద ఉన్న వ్యతిరేకత కూటమికి కలిసి వచ్చింది !


ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కీలక వ్యాఖ్యలపై చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ముందుగా జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పాలి. జగన్ ఇంటికి వెళ్లి పూల బొకేతో విష్ చేయాలి. అందరికంటే జగన్ ఎక్కువ కష్టపడ్డారని నారాయణ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. వామపక్షాల ఓట్ల శాతం పెరిగింది. పరిమితమైన సంతృప్తిలో ఉన్నాం. ఏపీలో ఎవరికి అంతుపట్టని ఫలితాలు వచ్చాయన్న నారాయణ.. గెలిచిన చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు. జగన్ మీద ఉన్న వ్యతిరేకత కూటమికి కలిసి వచ్చిందని అన్నారు. మోడీకి చంద్రబాబు, నీతిశ్ కుమార్ లేకపోతే మోదీ ప్రధాని కాలేడు. కచ్చితమైన ప్రతిపాదన చంద్రబాబు కేంద్ర వద్ద పెట్టాలని, విభజన హామీలు నెరవేర్చుకోవాలి, ఏపీకి ఫండ్స్ ఇప్పించుకోవాలని నారాయణ సూచించారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేలా కాకుండా రాష్ట్ర ప్రయోజనాలకోసం పని చేయాలి. జగన్ పరిపాలన.. చంద్రబాబు గుణపాఠంగా చూడాలని నారాయణ అన్నారు. హైదరాబాద్ మీద చంద్రబాబు ఆశలు పెట్టుకోకుండా ఏపీ రాజధానిపై ఫోకస్ పెట్టాలి. పంతాలు పట్టింపులకు పోకుండా అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలని నారాయణ సూచించారు. సంక్షేమ పథకాల ద్వారా.. అధికారం వస్తుందనుకోవడం తప్పు. అభివృద్ధి ద్వారా వస్తుందన్న విషయాన్ని జగన్ గుర్తించ లేకపోయాడు. జగన్ ఐదేళ్లు సంక్షేమ పాలనచేస్తే ఓట్లు ఎందుకు కొనుకున్నాడని నారాయణ ప్రశ్నించారు. నిరంకుశ పాలన కారణంగానే జగన్ అధికారం కోల్పోయాడు. చదువుకున్న వాడు అనుకున్నాం. కానీ, తప్పులు చేశాడు.


Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org