వాట్సాప్‌ లో ట్రాన్స్‌ఫర్‌ చాట్ హిస్టరీ ఫీచర్‌ ?


కొత్త మొబైల్ ఫోన్‌ తీసుకున్నా, ఫోన్‌ ఫ్యాక్టరీ రీసెట్ చేసినా పాత మెసేజ్‌లను బ్యాకప్‌ చేసుకోవడం సాధారణమైన విషయమే అయితే ప్రస్తుతం ఈ బ్యాకప్‌ కాస్త క్లిష్టమైన విధానంతో కూడుకుంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకే వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది. వాట్సాప్‌ ట్రాన్స్‌ఫర్‌ చాట్ హిస్టరీ అనే ఫీచర్‌ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఈ ఫీచర్‌తో కేవలం ఒకే ఒక క్లిక్‌తో వాట్సప్‌ చాట్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో యూజర్లు గూగుల్ డ్రైవ్‌ను ఉపయోగించకుండానే పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్‌కి చాట్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇందుకోసం యాప్‌ సెట్టింగ్స్‌లో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే సరిపోతుంది. వెంటనే మీ పాత వాట్సాప్‌ చాట్స్‌ బ్యాకప్‌ అవుతాయి. ప్రస్తుతం వాట్సాప్‌ బ్యాకప్‌ కోసం ఐక్లౌడ్‌ లేదా గూగుల్‌ డిస్క్‌కి బ్యాకప్‌ చేసి ఆ తరువాత మరో ఫోన్‌లో చాట్ హిస్టరీ పొందేవారు. అయితే ఇప్పుడు ఈ సమస్య లేకుండా కేవలం ఒకే ఒక్క స్కాన్ తో చాట్ హిస్టరీని బదిలీ చేసేందుకు ఫీచర్ ఉపయోగపడుతుంది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా క్లౌడ్ బ్యాకప్‌ను బైపాస్ చేసి, మరో ఫోన్‌లోకి చాట్ హిస్టరీని పంపుతుంది. త్వరలోనే ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org