తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాల కదలికలు చురుగ్గా ఉన్నాయి. ఈరోజు, రేపు కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కి.మీ. వేగంతో కూడిన తేలికపాటి నుండి మొస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. కాగా సాయంత్రం, రాత్రి సమయాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీలు, 24 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశగా వీచే అవకాశం ఉంది. గంటకు 4-6 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 32.6 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23.7 డిగ్రీలుగా నమోదైంది. గత 13 రోజులుగా రాయలసీమ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. నంద్యాల జిల్లాలో అత్యధికంగా 309.1% వర్షపాతం నమోదైంది. రుతుపవనాలు ఆలస్యంగా రావడమే ఇందుకు కారణం. రుతుపవనాల ఆగమనం రేఖ విజయవాడ – మధ్య ఆంధ్ర – దక్షిణ తెలంగాణ మీదుగా ఉండడంతో రాయలసీమలో అధిక వర్షపాతం నమోదైంది. రాయలసీమలో కాకుండా ఉత్తర కోస్తా ఆంధ్రలో తక్కువ వర్షపాతం నమోదైంది. రానున్న రోజుల్లో రుతుపవనాలు వేగం పుంజుకోనున్నాయి. రాయలసీమలో కూడా ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
0 Comments