మద్యం మత్తులో పోలీస్ స్టేషన్ ముందు నగ్నంగా సైకో వీరంగం !


ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా చల్లపల్లిలో సైకో శివ మద్యం మత్తులో ఒంటి మీద బట్టలు లేకుండా ప్రధాన సెంటర్లలో కత్తి పట్టుకుని తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. కోమల నగర్ గుడారాల వద్ద జరిగిన ఘర్షణలో గాయపడిన శివ, మద్యం మత్తులో తీవ్ర గాయాలతో నగ్నంగా కత్తి పట్టుకుని చల్లపల్లిలో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. పోలీస్ స్టేషన్ ముందు నగ్నంగా కూర్చుని హల్ చల్ చేశాడు. ఈ క్రమంలో శివను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం తీవ్ర గాయాలతో ఉన్న శివను చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org