ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు, ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో ఆవిష్కృతం !


హైదరాబాద్‌లో జరిగిన మీడియాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు, ఆరు  నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం అవుతున్నాయన్నారు. పదేళ్లు కనిపించని కరెంట్ కోతలను చూస్తున్నామని, విద్యుత్తు సబ్ స్టేషన్ల ముట్టడిలు, కాలిన మోటర్లు, పేలిన ట్రాన్స్‌ఫార్మర్లు, ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు-జనరేటర్ల మోతలు చూస్తున్నామన్నారు. సాగునీరు లేక ఎండిన పంట పొలాలను చూస్తున్నామని, ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు, చుక్కనీరు లేక బోసిపోయిన చెరువులు, పాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులు, రైతుబంధు కోసం నెలలపాటు పడిగాపులు, తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కు లేని దుస్థితి, పదేళ్ల తరువాత అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నామని కేటీఆర్ అన్నారు. చివరికి ఇవాళ జోగిపేటలో విత్తనాల కోసం రైతుల మొక్కులు చూస్తున్నామని, క్యూలైన్‌లో పాసు బుక్కులు, కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదని కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదని, ఈ వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org