తెలంగాణలో 80 శాతం దొడ్డు వడ్లనే పండిస్తారు !


హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ  కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై మరోసారి తీవ్రంగా ధ్వజమెత్తారు. ‘సన్నవడ్లకే బోనస్ అంటూ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రాష్ట్రంలో 80 శాతం దొడ్డు వడ్లనే పండిస్తారు. చాలా తక్కువ మంది రైతులు సన్నవడ్లు పండిస్తారు. దొడ్డు వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. దొడ్డు వడ్లను కొనేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఈ ప్రభుత్వం బోనస్ పేరుతో రైతులను మోసం చేసింది.’ అని కిషన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని ఆ పార్టీ తుంగలో తొక్కుతోందని విమర్శించారు. ఇప్పటి వరకు ఒక్క గ్యారంటీ కూడా సక్రమంగా అమలు చేయలేదని మండిపడ్డారు. రుణమాఫీ చేస్తామని రాష్ట్ర సర్కార్ రైతులను మోసం చేస్తోందని దుయ్యబట్టారు. డిసెంబరు 9నే రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఇప్పుడేమో ఆగస్టు 15లోగా చేస్తామని అంటోందని ధ్వజమెత్తారు. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org