101 జిల్లాల అందగాడు

 

'ఏ జుట్టు దువ్వుకుంటే దువ్వెనలకు పళ్లు సైతం రాలతాయని భయమేస్తుందో.. ఏ జుట్టు ముడిస్తే, కొండలు సైతం కదలుతాయో.. అటువంటి బలమైన, దట్టమైన, అందమైన జుట్టు ఇచ్చి, నన్ను ఈ కేశ దారిద్ర్యం నుంచి బయటపడేసి..ఈ క్షవర సాగరం దాటించు స్వామి' అంటూ వేడుకుంటున్నారు అవసరాల శ్రీనివాస్‌. ఆయన హీరోగా నటించిన చిత్రం '101 జిల్లాల అందగాడు'. రుహానీశర్మ కథానాయిక. రాచకొండ విద్యాసాగర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శిరీష్‌, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. దిల్‌రాజు, జాగర్లమూడి క్రిష్‌ సమర్పిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకోగా, బుధవారం ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ విడుదల చేశారు. ఆద్యంతం అలరించేలా, నవ్వులు పంచేలా సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబరు 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ''బట్టతలతో కనిపించే గొత్తి సత్యనారాయణ పాత్రలో అవసరాల, ఆయన ప్రేయసి పాత్రలో రుహానీ కనిపించనున్నారు. అవసరాల కథానాయకుడిగా నటించడంతోపాటు, అందరికీ కడుపుబ్బా నవ్వించే ఈ కథనీ అందించార''ని చిత్ర బృందం తెలిపింది. కడుపుబ్బా నవ్వించే ఈ మూవీ ట్రైలర్‌ మీరూ చూసేయండి. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org