భారత్ లో కరోనా ఎప్పటికీ ఉండిపోతుందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి మారుతోందని, మరికొన్ని రోజులు కోవిడ్ ఇలానే ఉండిపోయే అవకాశం ఉందని తెలిపింది. పిల్లలకు కరోనా సోకినా, వ్యాధి తీవ్రత అతి స్వల్పంగానే ఉంటుందని పేర్కొంది. గతంలో ఈ విషయంలో పలువురు శాస్త్రవేత్తలు స్పందించిన సంగతి తెలిసిందే. కోవిడ్ ఎప్పటికీ అంతం కాదని, మనతోనే శాశ్వతంగా ఉంటుందని చాలా మంది శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సార్స్ కోవి-2ను అంతం చేసే అవకాశం లేదా ? అని ప్రముఖ సైన్స్ జర్నల్ నేచర్ గత జనవరిలో ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా…మ్యునాలజిస్టులను, వైరాలజిస్టులను, ఆరోగ్య నిపుణులను అడిగింది. నిర్మూలించడం కుదరదని వారిలో 90 శాతానికి పైగా సమాధానం ఇచ్చారు.
మరోవైపు భారత్ లో కరోనా ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. గత 24 గంటల్లో 37,593 కొత్త కరోనా కేసులు దేశంలో నమోదయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం…24 గంటల్లో 648 మంది చనిపోయారు. ఎక్కువగా కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. కేరళలో 24,296 కొత్త కోవిడ్ కేసులు రావడంతో, మొత్తం కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 38 లక్షల 51 వేల 984 కు పెరిగింది. మరో 173 మంది కరోనా కారణంగా మరణించగా.. మొత్తం మరణించిన వారి సంఖ్య 19,757కి చేరుకుంది.
0 Comments