పాతాళగంగ వద్ద నీటమునిగి ఇద్దరు గల్లంతు : ఒకరు మృతి
శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద కృష్ణా నదిలో స్నానానికి దిగిన ముంబయికి చెందిన సచిన్ తోపాటు మరో యువకుడు ప్రమాదవశాత్తూ నీటిలో గల్లంతయ్యారు. నీటిలో మునిగిపోతున్న ఇద్దరిని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించారు. అయితే సచిన్ ప్రాణాలు కోల్పోగా మరో యువకుడిని సురక్షితంగా కాపాడారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సచిన్ మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టంకు తరలించారు.